live
Live: టీడీపీ 'జయహో బీసీ' కార్యక్రమం -ప్రత్యక్ష ప్రసారం - jayaho bc meeting Live
<p><strong>TDP Jayaho BC Program Live : </strong>తెలుగుదేశం పార్టీ చేపట్టిన జయహో బీసీ కార్యక్రమం నేటి నుంచి ఎన్టీఆర్ భవన్‌లో మొదలైంది. బీసీలు బలహీనులు కాదు బలవంతులన్న నినాదాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అలాగే ప్రతి నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో 'జయహో బీసీ' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జయహో బీసీ లక్ష్యాలను పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో క్షేత్ర స్థాయికి తీసుకెళ్లనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచీ బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశమని చంద్రబాబు గుర్తు చేశారు. బీసీల ఎదుగుదలే తమ పార్టీ భావజాలంగా గత 40 ఏళ్లుగా పని చేస్తోందన్నారు. 'భవిష్యత్తుకు గ్యారెంటీ' లో భాగంగా దేశంలోనే మొదటిసారిగా 'బీసీలకు రక్షణ చట్టం' తెచ్చి వారికి అన్ని విధాలా అండగా నిలవాలని నేతలు నిర్ణయించారు. బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందచేస్తామన్నారు. బీసీ ఉప కులాల కోసం ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేసి వారికే ఖర్చు చేస్తామని తెలిపారు.</p>
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2024, 11:45 AM IST
|Updated : Jan 4, 2024, 2:40 PM IST
Last Updated : Jan 4, 2024, 2:40 PM IST