Governor Justice Abdul Nazeer Live
LIVE: జేఎన్‌టీయూ వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ - ప్రత్యక్ష ప్రసారం - governar live programe
<p><strong>Governor Justice Abdul Nazeer Live : </strong>స్నాతకోత్సవానికి జేఎన్‌టీయూ వర్సిటీ ముస్తాబైంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొననున్నారు. 2021-22, 2022-23 విద్యాసంవత్సరాల్లో సాంకేతిక, ఔషధ కోర్సులు పూర్తి చేసుకొన్న వారికి స్నాతకోత్సవం రోజున గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు, బంగారు పతకాలు అందజేస్తున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో జరగనున్న ఈ వేడుకకు ఉపకులపతి రంగ జనార్దన అధ్యక్షత వహించారు. జేఎన్‌టీయూ పూర్వవిద్యార్థి, కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య బాలవీరారెడ్డికి ఈ సంవత్సరం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నారు. దిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాజీ డైరెక్టర్ ఆచార్య సత్యనారాయణరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. </p><p>స్వాతంత్య్రానికి పూర్వమే జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడింది. 1946లో అప్పటి మద్రాసు రాష్ట్రం అనంతపురంలో జేఎన్‌టీయూను ఏర్పాటు చేసింది. 2008లో దీనికి విశ్వవిద్యాలయం హోదా లభించింది. అప్పటి నుంచి 12 స్నాతకోత్సవాలు జరిగాయి. 13వ స్నాతకోత్సవం శనివారం జరగతుంది. జేఎన్‌టీయూ పరిధిలో వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరించారు.</p>
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 6, 2024, 11:23 AM IST
|Updated : Jan 6, 2024, 12:09 PM IST
Last Updated : Jan 6, 2024, 12:09 PM IST