chandrababu_meeting
Live: కమలాపురంలో చంద్రబాబు ' రా కదలిరా ' బహిరంగ సభ - ప్రత్యక్ష ప్రసారం - Public Meeting CBN
<p>Chandrababu Public Meeting in Kamalapuram Live : రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష నేత చంద్రబాబు చేపట్టిన ' రా కదలిరా ' కార్యక్రమం వైఎస్సార్ జిల్లా కమలాపురంలో ఈ రోజు సాయంత్రం నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజక వర్గంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. అనంతరం కమలాపురం జరగబోయే సభకు తెలుగు దేశ నేత చంద్రబాబు హాజరుకానున్నారు. బహిరంగ సభను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేసినట్లు టీడీపీ శ్రేణులు పేర్కొన్నారు.</p><p>వెంకటగిరి నియోజక వర్గంలో జరిగిన రా కదలిరా అనే కార్యక్రమం గర్జించిందని చంద్రబాబు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయ దృశ్యం మారిపోతోందని తెలియజేశారు. సీనియర్లను కూడా లెక్కపెట్టని అహంకారం జగన్‌ది అని ఆరోపించారు. తుగ్లక్ సీఎం వెయ్యి తప్పులు చేసిన చూస్తూ భరిస్తారా అని ప్రశ్నించారు. ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రజలు ప్రయోగించే సమయం వచ్చిందని తెలియజేశారు.</p>
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 19, 2024, 3:55 PM IST
|Updated : Jan 19, 2024, 5:49 PM IST
Last Updated : Jan 19, 2024, 5:49 PM IST