LIVE 'సంక్రాంతి సంకల్పం' భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్- మందడం నుంచి ప్రత్యక్ష ప్రసారం - Pawan Kalyan live
<p>Live : రాజధాని ప్రాంతంలో నేడు నిర్వహించిన భోగి మంటల కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలుపుతున్నారు. అమరావతి ప్రాంతంలో ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో ఇరు పార్టీల అధినేతల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సంక్రాంతి సందర్భంగా "పల్లె పిలుస్తుంది రా కదలి రా" పేరుతో టీడీపీ వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చింది. భోగి సందర్భంగా వివిధ సమస్యలకు సంబంధించిన ఫొటోల్ని భోగి మంటల్లో దహనం చేయాలని ప్రకటించింది. సొంతూళ్లకు చేరుకున్న వారు సాయంత్రం గ్రామస్థాయిలో ఆత్మీయ సమావేశం నిర్వహించి స్థానికంగా నెలకొన్న సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి పనులపై ఓ తీర్మానం చేయాలని కోరారు. ఓటర్ వెరిఫికేషన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకొని ఓటు ఉందో? లేదో? తనిఖీ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ చంద్రబాబు ప్రకటించిన సూపర్‌సిక్స్, యువగళం, రీబిల్డ్ ఏపీ తదితర అంశాల మీద రేపు ముగ్గులు వేసి వాటితో సెల్ఫీలు దిగాలని పిలుపునిచ్చారు. ముగ్గుల ఫోటోలను పల్లె పిలుస్తోంది రా కదలి రా హ్యాష్ లైన్‌కు ట్యాగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని కోరారు.</p>
🎬 Watch Now: Feature Video
Chandrababu and Pawan Kalyan Participate in Bhogi Festival live
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 14, 2024, 8:27 AM IST
|Updated : Jan 14, 2024, 9:46 AM IST
Last Updated : Jan 14, 2024, 9:46 AM IST