టోక్యోలో ఉండే యూనీ అనే ఈ బుజ్జి కుక్కపిల్ల అందర్నీ ప్రత్యకంగా ఆకట్టుకుంటోంది. దీనికి మాంసాహారం, బిస్కెట్లూ, పెడిగ్రీ వంటివేం పెట్టినా నచ్చవు. మొహం తిప్పుకుని వెళ్లిపోతుంది. అదే పిజ్జా, బర్గర్, పాస్తా, ఫ్రెంచ్‌ఫ్రైస్, నూడుల్స్, ఐస్‌క్రీమ్... ఇలా ఏదైనా జంక్ ఫుడ్ గానీ... ఇచ్చారో లొట్టలేసుకుని మరీ చిటికెలో లాగించేస్తుంది. ఆ సమయంలో దాని హావభావాలు చూస్తే సంబరంతో నవ్వుతున్నట్టే అనిపిస్తుంది.
ఈ పప్పీకి పిజ్జా, బర్గర్లంటే భలే ఇష్టమట! - yuni puppy in tokyo latest news
ముద్దుముద్దుగా ఉండే పప్పీలను చూస్తే ఎవరికి మాత్రం ముచ్చటేయదు. అలానే అవి చేసే కొన్ని చేష్టలు చూసినా భలేగా అనిపిస్తుంది. టోక్యోలో ఉండే యూనీ అనే ఈ బుజ్జి కుక్కపిల్ల కూడా అందర్నీ అలానే ఆకట్టుకుంటోంది.
![ఈ పప్పీకి పిజ్జా, బర్గర్లంటే భలే ఇష్టమట! ఈ పప్పీకి పిజ్జా, బర్గర్లంటే భలే ఇష్టమట!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9052642-1030-9052642-1601875976238.jpg)
ఈ పప్పీకి పిజ్జా, బర్గర్లంటే భలే ఇష్టమట!
అందుకే ఈ శునకం కోసం వేలకు వేలు ఖర్చుపెట్టి కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్స్ నుంచి రోజూ జంక్‌ఫుడ్‌ను ఆర్డర్ చేస్తున్నాడు యజమాని. షీబా, ఇన్యూ జాతి శునకాల నుంచీ పుట్టిన ఈ పప్పీ వయసు 9 నెలలు. దీనికి ఇన్‌స్టాగ్రామ్‌లో ‘షీబా యూనీ’ పేరిట ఓ ఖాతా కూడా ఉంది. అందులో కోట్ల మంది నెటిజన్లు దీనికి లైకులు కొట్టగా.. ఈ పప్పీ ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.