గుప్పెడు వేపాకులను నీళ్లలో వేసి.. పచ్చగా మారేంతవరకు మరిగించాలి. ఈ నీటిని సీసాలో నిల్వ చేసుకోవాలి. స్నానానికి ముందు నీటిలో కలిపితే దురదలు తగ్గుతాయి.
*వేపాకులను మరిగించిన నీటిలో దూది ఉండను ముంచి దాంతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమలూ, మచ్చలూ మాయం అవుతాయి. ఈ ఆకులను మెత్తగా నూరి చిటికెడు పసుపు కలిపి మొటిమలు, మచ్చలు ఉన్నచోట రాస్తే అవి క్రమంగా కనిపించవు.
* రెండు చెంచాల నారింజ తొక్కల పొడిలో ఐదారు వేపాకులను వేసి మెత్తని పేస్టులా చేయాలి. దీనికి తేనె, పెరుగు, సోయాపాలు కలిపి ముఖానికి రాయాలి. పావుగంట తర్వాత కడిగేస్తే మొటిమలు, వైట్‌హెడ్స్ తగ్గుతాయి. అంతేకాదు ముఖానికి తేమా అందుతుంది.
* వేపాకులను మరిగించిన నీటిలో తేనె కలిపి జుట్టుకు పట్టించాలి. అరగంటాగి తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు మంచి కండిషనర్‌లా పనిచేస్తుంది.