ఇంతకుముందు అన్ని పనులు ఠంచనుగా జరిగేవి. తొమ్మిదింటికల్లా అందరూ ఎవరి విధులకు వారు వెళ్లిపోయేవారు. మీకంటూ కాస్త సమయం ఉండేది. ఇప్పుడలా కాదు. ఇంటి నుంచి విధులు నిర్వహించే భర్త, స్కూలు లేకపోవడంతో ఇంటికే పరిమితమైన పిల్లలతో ఇంట్లో సందడి పెరిగింది. చిన్నారులు బయటకు వెళ్లకుండా కనిపెట్టుకుని ఉండటం, అందరికీ అన్నీ సమయానికి అందించడం నిత్యకృత్యంగా మారింది. పిల్లల అల్లరిని నియంత్రించలేక మీలో ఒత్తిడి పెరిగిపోవడం, భార్యభర్తల మధ్య వాగ్వాదాలు... అందరూ మిమ్మల్నే తప్పు బడుతున్నారనే భావనతో ఒక రకమైన పశ్చాత్తాపం.. ఇవన్నీ మీకు తెలియకుండానే మిమ్మల్ని కుంగుబాటుకు గురి చేస్తున్నాయి.
ఒత్తిడి పెరుగుతోంది.. అన్నిపనులూ నేనే చేస్తున్నా! - stress is increasing as the housewife is doing all the chores
నేనొక గృహిణిని. ఇంతకు ముందు ఎన్ని పనులున్నా ఒంటి చేత్తో చేసుకునేదాన్ని. ఈ కొవిడ్-19 మొదలైనప్పటి నుంచీ నా జీవనశైలిలో బాగా మార్పులొచ్చాయి. ఇంతకుముందులా సమయం సరిపోవడం లేదు. పనులు ఓపట్టాన పూర్తి కావడం లేదు. దాంతో బాగా అలసిపోతున్నా. మానసికంగానూ ఒత్తిడి ఎక్కువైంది. వీటి నుంచి ఎలా బయటపడాలి? - ఓ సోదరి
ఒత్తిడి పెరుగుతోంది.. అన్నిపనులూ నేనే చేస్తున్నా!
మీరేం చేయాలంటే...
ముందుగా మీ భాగస్వామితో అన్ని విషయాలను మనసు విప్పి మాట్లాడండి. మీరు చేస్తున్న పనులు, మీకున్న సమయం, మీరు పడుతున్న బాధా, ఒత్తిడీ... ఇలా అన్నింటినీ ఆయనకు అర్థమయ్యేలా వివరించండి. ఎవరి పనులు వారు పూర్తిచేసుకునేలా ఇంట్లో పిల్లలకు తర్ఫీదునివ్వండి. ఇచ్చిన పనులు పూర్తయితేనే వారు అడిగింది ఇస్తానని చెప్పాలి. చిన్నారులు వారి పనుల్లో బిజీగా ఉన్నప్పుడు మీ పనులు చేసుకోవడమో లేదా విశ్రాంతి తీసుకోవడమో చేయాలి.