ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

కాస్త డిఫరెంట్​గా ట్రై చేయండి - t shirt

నేడు ప్రేమికుల దినోత్సవం... మరి మీలో సగమైన మీ ప్రేయసికి లేదా ప్రియుడికి ఎప్పుడు ఇచ్చే గిఫ్టులే కాకుండా కాస్త కొత్తగా, వినూత్నంగా ఇచ్చి వారి మదిని దోచుకోండి.

కాస్త డిఫరెంట్​గా ట్రై చేయండి
author img

By

Published : Feb 14, 2019, 6:41 AM IST

Updated : Feb 14, 2019, 8:07 AM IST

అవే గులాబీలు, అవే టెడ్డీ బేర్లు, అవే చాక్లెట్లు... ప్రేయసికి ప్రేమికుల రోజున గిఫ్ట్​ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా...? ఆపండి.. ఇరవై ఏళ్లుగా ప్రేమికుల దినోత్సవం అంటే ఇవ్వే గిఫ్టులు ఇచ్చి వాటిలో కొత్తదనం మాట పక్కన పెడితే... ఈ కాలం అమ్మాయిలు మార్పు కోరుకుంటున్నారు. మరి ఇలాంటి కొత్త గిఫ్టులు ఇచ్చి మీరు ఇష్టపడేవారికి ఇచ్చి ప్రపోజ్ చేయండి.

ఫోటోలన్ని కలిపి ఫోటో ఫ్రేమ్...

in article image
కాస్త డిఫరెంట్​గా ట్రై చేయండి

ఫోటో ఫ్రేము గిఫ్ట్​గా ఇవ్వడం మామూలే... ప్రియురాలి ఫోటోలన్ని కలిపి ఒక ఫ్రేమును గిఫ్ట్​గా ఇవ్వడం కొత్తదనం. వీటి కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మీ చరవాణిలో ఫోటో ఎడిటింగ్​ యాప్స్​ను వాడితే సరిపోతుంది. ఫోటో స్టూడియోల్లో ఫ్రేము తయారు చేయించుకోవాలి.

బాటిల్​లో ప్రేమలేఖ...

కాస్త డిఫరెంట్​గా ట్రై చేయండి

కొందరు తమ వన్​ సైడ్ ప్రేమను ప్రేమిస్తున్నవారికి వ్యక్తం చేయలేరు. అంత ధైర్యం రాదు ఎందుకంటే నో చెప్తారేమోనని. అలాంటి వారు తమ భావాలను, ప్రేమను సరళమైన పదాలతో సూటిగా లేఖమీద రాసి చిన్న గాజు సీసాలో పెట్టి ప్రపోజ్ చేస్తే ఎవరు నో చెప్తారు చెప్పండి.

రింగ్...

కాస్త డిఫరెంట్​గా ట్రై చేయండి

ఉంగరం ఇవ్వడం పాతదే అయినా... ఎవర్ గ్రీన్.. ప్రతి అమ్మాయికీ నచ్చే గిఫ్ట్​లలో రింగ్ ఎప్పటికీ ఉంటుందని ఓ సర్వేలో తేలింది. ఎన్నో ప్రేమ సినిమాల్లో ఈ సీన్​కు ఉన్నంత క్రేజ్​ మామూలుగా ఉండదు. మీ ప్రియురాలి చేతికి మీరు ఇచ్చిన రింగ్​ను చూస్తున్నప్పుడు వచ్చే ఆనందం వర్ణించలేనిది.

టీ షర్ట్స్​...

కాస్త డిఫరెంట్​గా ట్రై చేయండి

మీరు ఇప్పటికే ప్రేమలో ఉన్నారు... మీ ప్రేయసీ లేదా ప్రియుడికి నచ్చిన కోట్స్​తో టీ షర్టుపై ముద్రించి ఇస్తే.. వాటితో వచ్చే ఆనందం వర్ణించలేనిది. టీషర్టులపై ప్రింటింగ్​ కోసం కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. అంతర్జాలంలో ఎన్నో వెబ్​సైట్లు మీకోసం సిద్ధంగా ఉన్నాయి.

గది అంతా బెలూన్లతో నింపండి...

కాస్త డిఫరెంట్​గా ట్రై చేయండి

మీ ప్రియుడిని ఇంటికి ఆహ్వానించండి. ఇల్లంతా బెలూన్లతో నింపండి. నచ్చిన వంటకం వండండి. ఇల్లంతా సువాసనలు వెదజల్లే ప్రకృతి సిద్ధమైన సుగంధాలను వెదజల్లండి. ఇంకో విషయం మరిచిపోకండి. గది వెలుతురు కేవలం క్యాండిల్ లైట్​తో మాత్రమే ఉండేలా చూసుకోండి.

Last Updated : Feb 14, 2019, 8:07 AM IST

ABOUT THE AUTHOR

...view details