- బుడిబుడి అడుగులు వేస్తూ పాకేటప్పుడు నడిపించే మత్స్యం అవుతావు...
- ఆటలాడుతూ కేరింతలు కొడుతుంటే చూసి మురిసిపోయే కూర్మం అవుతావు...
- భుజాల మీద ఎక్కించుకుని లోకాన్ని చూపిస్తూ వరాహం అవుతావు...
- అల్లరి చేస్తే కోపం నటించే నారసింహుడు అవుతావు...
- ఇష్టాలను తీర్చేందుకు ఇతరుల దగ్గర చేయి చాచే వామనుడు అవుతావు...
- ఎన్ని కష్టాలు వచ్చినా నరుక్కుంటూ వెళ్లే భార్గవుడు అవుతావు...
- జీవిత విలువల నడవడిక నేర్పే రాముడు అవుతావు...
- జీవిత యుద్ధపు మెళకువలు నేర్పే కృష్ణుడు అవుతావు...
- సత్యం, దయ, ధర్మం విలువలు నేర్పే బుద్ధుడు అవుతావు...
- పిల్లల రక్షణ కోరే కల్కి అవుతావు...
నీ ప్రేమ అమూర్తం
నీ త్యాగం అనిర్వచనీయం