- ముఖంపై జిడ్డు పేరుకోకుండా తరచూ చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. కఠిన రసాయనాలతో కూడిన సబ్బులు కాకుండా పీహెచ్‌శాతం తక్కువ ఉన్న లిక్విడ్ సోప్ రకాల్ని మాత్రమే ఎంచుకోవాలి. టీ ట్రీ ఆయిల్‌ని రోజూ ఓ పూట ముఖానికి రాసుకున్నా ఫలితం ఉంటుంది. అరటిపండు తొక్కని మెత్తగా చేసి దానిలో కొద్దిగా తేనె, రెండు చుక్కల టీట్రీ ఆయిల్ కలిపి పూతలా వేసుకోవాలి. ఇలా చేస్తే క్రమంగా మొటిమలు అదుపులోకి వస్తాయి.
- పావుకప్పు పెసరపిండిలో కాసిని పాలు, తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బయటి నుంచి వచ్చాక ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దాలి. దీనివల్ల మృతకణాలు తొలగి చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.
- ఓట్‌మీల్ మంచి అల్పాహారంగానే కాదు మొటిమలు తగ్గడానికీ చక్కగా ఉపయోగపడుతుంది. వాటి తాలూకు మచ్చల్నీ నియంత్రిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. ఇందులోని జింక్ యాక్నేను అదుపులో ఉంచుతుంది. పావుకప్పు ఓట్‌మీల్‌లో కొన్ని కొబ్బరినీళ్లు, తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపిన పేస్ట్‌తో ప్యాక్ వేసుకుంటే సరి.
మొటిమలకు, జిడ్డు మొహానికి బైబై చెప్పండిలా! - women health news
టీనేజీ అమ్మాయిలు ముఖంపై చిన్న మొటిమ కనిపిస్తే చాలు... అల్లాడిపోతారు. హార్మోన్ సమస్యలతో పాటు జిడ్డు ఎక్కువగా పేరుకోవడం, కాలుష్యం వంటివి దీనికి కారణాలు కావొచ్ఛు వీటిని అదుపులో ఉంచుకోవడానికి ఈ చిట్కాలు మీకెంతో సాయపడతాయి.
మెుటిమలు ఉన్నాయా? ఈ చిట్కాలు పాటించండి