ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

కనుబొమలు ఒత్తుగా పెరగాలంటే.. ఈ చిట్కాలు పాటించండి! - tips to black eyebrows news

కొందరికి కనుబొమలు చాలా పలచగా ఉంటాయి. పెన్సిల్​తో తీర్చిదిద్దుకుంటే ఒత్తుగా కనిపించినా.. కృత్రిమంగానే అనిపిస్తుంది. మరి కనుబొమలు నల్లగా, ఒత్తుగా పెరగడానికి ప్రముఖ కాస్మటాలజిస్ట్ డాక్టర్ శైలజ సూరపనేని ఏం చిట్కాలు చెబుతున్నారో చూడండి.

కనుబొమలు ఒత్తుగా పెరగాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!
కనుబొమలు ఒత్తుగా పెరగాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

By

Published : Dec 7, 2020, 7:02 PM IST

ఒత్తిడిని తగ్గించుకుని పోషకాహారం తీసుకోండి. కనుబొమలను ట్రిమ్‌ చేసుకునే క్రమంలో గట్టిగా లాగకూడదు. క్రీముల్లో రసాయనాలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. అలాగే టేబుల్‌స్పూన్‌ ఆముదంలో టీస్పూన్‌ కొబ్బరినూనె కలిపి రోజూ రాత్రి కనుబొమలు ఒత్తుగా పెరగాలంటే... కనుబొమలకు రాస్తే ఒత్తుగా పెరుగుతాయి.

కనుబొమలు పలచగా కావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కుటుంబంలో ఎవరికైనా పలచగా ఉంటే మీకూ అలాగే ఉంటాయి. కొందరికి వయసు పెరిగేకొద్దీ పలచగా అవుతాయి. అలాగే ఎక్కువగా మేకప్‌ వేసుకున్నా, అదే పనిగా ఐబ్రో పెన్సిల్‌ వాడినా, షేపింగ్‌ చేసినా పలచగా అవుతాయి. అంతేకాకుండా ఇతర ఇన్‌ఫెక్షన్లు, హోర్మోన్ల తేడాలు, పోషకాహార లేమి, ఒత్తిడి వల్ల కూడా ఇలా అవుతాయి.

ఆహార లోపాల వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫ్యాట్‌, ఫైబర్‌, అమైనో, ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, మినరల్స్‌... ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఏవి లోపించినా ఈ సమస్య వస్తుంది. ఉదాహరణకు జింక్‌, విటమిన్‌-ఎ లోపిస్తే సెల్యులోజ్‌ పెరుగుదల తగ్గి ఐబ్రోస్‌ పలచబడతాయి. ముఖ్యంగా బయోటిన్‌, విటమిన్‌-సి, ఇ, బి12, డి16, ఐరన్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వీటిల్లో ఏవి తగ్గినా సమస్యే.

ABOUT THE AUTHOR

...view details