అన్నం తినడం గంట ఆలస్యమైనా.. పర్వాలేదు. ఫోన్ మాత్రం మాట్లాడాలి. లేకపోతే అస్సలు భోజనం రుచి కలగదు. అమ్మనాన్నతో మాట్లాడి నెల రోజులైనా పట్టించుకోం. సోషల్ మీడియా యూనివర్సిటీలో మాత్రం షేర్, లైక్ చేయకపోతే తట్టుకోలేం. ఓ పక్క క్లాస్ రూంలో టీచర్ పాఠం చెబుతుంది... మనసంతా ఫేస్బుక్లో ఎన్ని ఫ్రెండ్ రిక్వెస్ట్లువచ్చాయోనని లాగుతుంది. ఎందుకింత ఫోన్‌కు బానిసలవుతున్నామని ఒక్కసారైనా.. ప్రశ్నించుకోవాలి.
రాము ఫోన్ వాడటంలో మహా యాక్టివ్. పడుకునే ముందు ఫ్రెండ్స్‌కు గుడ్‌నైట్ చెప్పడం అలవాటు. ఆ శుభరాత్రి కాస్త.. శుభోదయం వరకూ.. వెళ్తోంది. ఫలితం నిద్ర ఉండదు. పడుకుందామనుకునే లోపు.. పదేపదే వచ్చే నోటిఫికేషన్లు. ఎక్కడి నుంచి వచ్చాయోనని ఓ ఆత్రత. ఇలా మన ఆరోగ్యానికి మనమే వైరస్ ఎక్కిస్తున్నాం. అంతేనా.. ఫోన్ వాడుతూ కుటుంబాన్ని పట్టించుకోని తల్లి. ఇయర్ ఫోన్ పెట్టుకుని రోడ్డుదాటుతూ.. చనిపోయిన యువకుడు.. ఇలా ఎన్ని ఘోరాలు జరుగుతున్న మార్పు మాత్రం శూన్యం.
సర్వేలు చెప్పే మాట..
⦁ గంటకి 5 సార్లు ఫోన్ చూసే యువత 40 శాతం మంది.
⦁ రోజుకు 253 సార్లు ఫోన్ చూసుకుంటున్న యువత 50 శాతం.
⦁ ఇంటర్నెట్ వాడుతున్నవారిలో 62 శాతం మంది సామాజిక మాధ్యమాల్లోనే గడిపేస్తున్నారు.
లేచినప్పటి నుంచి పడుకునే వరకు..
ఓ వ్యక్తి చేతిలో ఫోన్ ఉండి.. ఏమైందో అని ఆత్రతతో ఉంటే ఉదయం అయిందని అర్థం. పడుకుందామనుకుని పదేపదే ఫోన్ టచ్ చేస్తున్నారంటే.. రాత్రి అయిందని అర్థం. ఫోన్ రింగ్‌తో నిద్ర లేవడం. బెడ్‌పైకి వెళ్లాక.. చివరిసారిగా ఫోన్ చూసి పడుకోవడం. 78 శాతం మంది లేచిన 5 నిమిషాల్లోనే ఫోన్‌ను చేతిలో పట్టుకునేవారు. ఒక వ్యక్తి రోజులో 50 నుంచి 60 సార్లు తమ స్క్రీన్‌ను అన్ లాక్ చేసి చూసుకుంటున్నారట. అవసరం లేకపోయినా తమ ఫోన్‌ను అరచేతిలో పెట్టుకొని రోజులో 90 సార్లు చూసేవారు 20 శాతం పైనే.
ఫోన్ ఎక్కువగా వాడితే..!
రింగ్జయిటీ:ఫోన్ రింగ్ అవ్వకపోయినా..రింగ్ అయినట్టు అనిపించడం.
ఫాన్టామ్ పాకెట్ వైబ్రెషన్ సిండ్రోమ్:ఫోన్ వైబ్రేషన్ మోడ్‌లో పెట్టుకున్నప్పుడు కారణం లేకుండా పదేపదే చూసుకోవడం. వైబ్రేట్ అవుతుందేమోనని భ్రమపడటం.
కంప్యూటర్ విజన్ సిండ్రోమ్: పదేపదే మానిటర్‌ను చూడటం వల్ల ఏర్పడే దృష్టి లోపం