ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

మీరు రన్నింగ్​కు వెళ్తున్నారా.. అయితే ఇవి పాటిస్తే మేలు!

రన్నింగ్... సులువైన ఫిట్​నెస్ మంత్రం. చాలామంది ప్రతిరోజూ వీలున్నప్పుడల్లా పరుగెత్తుతుంటారు. తమనుతాము ఫిట్​గా ఉంచుకుంటారు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరుస్తారు. షూ, దుస్తులు, ఆహారం, పరుగెత్తే స్థలం, రన్నింగ్​కు ముందు, తరువాత చేయాల్సిన పనులు చేయరు. ఫలితంగా ఆరోగ్యంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 'ఈటీవీభారత్' ప్రత్యేక కథనం.

running tips
running tips

By

Published : Dec 30, 2019, 7:02 AM IST

రన్నింగ్​కు సాధారణ షూ వేసుకోవడం కారణంగా... కీళ్ల సమస్యలు వస్తాయి. త్వరగా ఎక్కువ దూరం పరిగెత్తినప్పుడు అలసిపోవటం, కండరాలు దెబ్బతినడం జరుగుతుంది. అందువల్ల రెగ్యులర్ రన్నింగ్ సెషన్స్ ప్రారంభించటానికి ముందు నిపుణులను సంప్రదించడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
కొత్తగా రన్నింగ్ ప్రారంభించేవారు... మొదట్లో త్వరత్వరగా పరుగెడుతుంటారు. ఫలితంగా తొందరగా అలసిపోతారు. ఫిజికల్ ఫిట్​నేస్ ఇబ్బందిపడతారు. అందుకే ప్రారంభంలో నెమ్మదిగా పరుగెత్తాలి. బాడీ ఫిట్ అయ్యాక వేగం పెంచాలి. రన్నింగ్ ప్రారంభించే ముందు సన్నద్ధత కోసం కొంత వ్యాయామం అవసరం.
రన్నర్స్ చేసే మరో పెద్ద పొరపాటు... అవసరమైన ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం. ఒకసారి రెగ్యులర్ రన్నింగ్ మొదలుపెట్టాక... అధిక ప్రోటీనులు, కార్బోహైడ్రేట్స్ ఉండే న్యూట్రీషియన్ డైట్ తీసుకోవాలి. రన్నింగ్, సైక్లింగ్ చేయడం వల్ల శరీరంలో తగ్గిపోయే క్యాలరీలను భర్తీ చేయడానికి ఇవి చాలా అవసరం.
ప్రతిరోజూ పరుగుకు వెళ్లేవారు, ప్రారంభించాలనుకునేవారు... దుస్తుల విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. అందుబాటులో ఉన్నవాటితో రన్నింగ్​కు వెళ్తుంటారు. ఫలితంగా చర్మ సమస్యలు తలెత్తుతాయి. అందుకే నిపుణుల సూచనల మేరకు సౌకర్యంగా ఉండే దుస్తులను వేసుకోవాలి. రన్నింగ్ తరువాత వాటిని కచ్చితంగా విప్పేయాలి. ఎక్కువ సమయం వాటిని వేసుకుంటే... అలా కూడా చర్మ వ్యాధ్యులు రావచ్చు.
ఇక.. పరుగెత్తే ప్రదేశమూ ముఖ్యమే. ఎక్కువగా ఫారెస్ట్ రన్నింగ్ చేస్తే... మేలు. అప్పుడు ఆక్సీజన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ దూరం పరుగెత్తవచ్చు. ఇలా ఇప్పుడు చేస్తున్నవారు ఈ నూతన ఏడాది నుంచి ప్రారంభించేవారు... ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు. గతంలో రన్నింగ్ అలవాటు లేనివారు... 2020 నుంచి ఓ కొత్త వ్యాయామాన్ని ప్రారంభించండి.

మీరు రన్నింగ్​కు వెళ్తున్నారా.. అయితే ఇవి పాటిస్తే మేలు!

ABOUT THE AUTHOR

...view details