ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

మంచి ఆహారంతో మానసిక ఒత్తిడి దూరం

జంక్​ఫుడ్​కి బదులు పీచుపదార్ధాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఒత్తిడి మనిషి చెంతకు చేరదు.

మానసిక ఒత్తిడి దూరం

By

Published : Feb 6, 2019, 4:12 PM IST

ఒత్తిడికి సరైన మందేంటి? ఒత్తిడిని తగ్గించుకోవచ్చా? మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నల గురించి అందరూ ఏదో ఒక సమయంలో ఆలోచిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారమే వీటన్నింటికీ సరైన సమాధానమని తాజా సర్వేలో తేలింది.
మానసిక ఆరోగ్యం కోసం క్లినికల్ ట్రైల్స్​కి వచ్చిన డేటా ఆధారంగా కొంత మంది ఈ విషయంపై పరిశోధనలు చేశారు. సంతులిత ఆహారం తీసుకుంటే మానసిక ఆరోగ్యంతో పాటు ఒత్తిడి కూడా నియంత్రించుకోవచ్చని తేలింది. ఈ నివేదిక సైకోమెడిక్ మెడిసిన్​లో ప్రచురితమైంది.


ఆరోగ్యకర డైట్ మనుషుల మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఉత్సుకతపై ఎలాంటి ప్రభావం చూపించదు. ఇంకా చెప్పాలంటే ఇది చాలా మంచి పరిణామం. నిర్ధిష్టమైన డైట్ తీసుకునే వాళ్లకి ఉపయోగపడుతుంది. అనవసరమైన ఆహారం తీసుకోవాల్సిన పనిలేదు.

- జోసేఫ్ ఫిర్త్, పరిశోధకులు


బరువు తగ్గడం, కొవ్వు నియంత్రణ, పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం లాంటి చర్యలతోనూ మానసిక ఆరోగ్యం కుదుటపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్స్​కి బదులు పీచుపదార్ధాలు ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకుంటే ఫలితం త్వరగా వస్తుందని ఫిర్త్ వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details