ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

బ్రౌన్​ షుగర్​తో తియ్యగా మెరిసిపోండిలా...

బ్రౌన్‌ షుగర్‌(ముడిచక్కెర)ను చర్మ సంరక్షణకు వాడితే ఎన్నో ప్రయోజనాలు. ఇది చర్మంపై పేరుకున్న మృత కణాలను తొలగిస్తుంది. మేని అందంగా మెరిసిపోయేలా చేస్తుంది. అదేలానో మీరే చూడండి...

face-packs-with-brown-sugar
face-packs-with-brown-sugar

By

Published : Sep 12, 2020, 9:39 PM IST

స్క్రబ్‌గా: బ్రౌన్‌ షుగర్‌, తేనెలను సమాన పరిమాణంలో తీసుకోవాలి. ఇందులో రెండు చుక్కల రోజ్‌ ఆయిల్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దాలి. పావుగంటాగి గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ఇందులో ఉండే గ్లైకోలిక్‌ యాసిడ్‌ ఎండ వల్ల రంగును కోల్పోయిన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. ముఖంపై మచ్చలు తగ్గుతాయి. ఇది మెలనిన్‌ ఉత్పత్తిని నియంత్రిస్తుంది.

మాయిశ్చరైజర్‌గా: బ్రౌన్‌ షుగర్‌లో కొద్దిగా బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమానికి రెండు చుక్కల జాస్మిన్‌ ఆయిల్‌ని చేర్చాలి. దీన్ని చర్మానికి రాసుకుని పదినిమిషాలు మర్దనా చేయాలి. తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. బ్రౌన్‌షుగర్‌ పొడిబారిన చర్మానికి తేమను అందించి మెరిపిస్తుంది.

ఫేస్‌మాస్క్‌: పావు కప్పు బ్రౌన్‌ షుగర్‌లో కొద్దిగా పాలూ, చెంచా పెసరపిండి కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖానికి పూత వేసుకోవాలి. ఆరాక కడిగేసుకుంటే సరి. ఇలా చేస్తే చర్మంపై మొటిమలూ, ముడతలూ, వాటి తాలూకు మచ్చలూ క్రమంగా తగ్గుతాయి.

ABOUT THE AUTHOR

...view details