రోజూ పొద్దునే సమయం కేటాయించలేకపోతే అసలు వ్యాయామమే మానేయొద్దు. రోజులో మీకు వీలున్నప్పుడు ఓ అరగంట నడకకు కేటాయించుకోండి. లేదంటే పావుగంట చొప్పున వీలున్నప్పుడు 4 సార్లు చేయండి. క్రమంగా నడకకు అలవాటు పడతారు.
వేగంగా నడిస్తే మంచిదే... అలాగని ఒక్కసారే అది సాధ్యపడకపోవచ్చు. మీకు సౌకర్యంగా అనిపించినంత వేగంగా నడిస్తే సరి. అసలంటూ మొదలుపెడితే... కొన్నాళ్లకు స్పీడు పెరుగుతుంది. సాధారణంగా చదునుగా ఉండే మార్గం కంటే కాస్త ఎత్తుగా ఉండే ప్రాంతాల్లో (కొండలు, గుట్టలు లాంటి ప్రదేశాల్లో) నడవడం వల్ల ఎక్కువ కెలోరీలు ఖర్చవుతాయి. ఫలితంగా.. శ్వాస రేటు పెరుగుతుంది. ఆక్సిజన్ సైతం శరీరానికి సరఫరా ఎక్కువగా ఉంటుంది.