- గుప్పెడు చొప్పున మందారపూలూ, ఆకులూ, కప్పు కలబంద గుజ్జు తీసుకుని కొబ్బరినూనెలో వేసి మరిగించాలి. చల్లారాక దాన్ని వడకట్టి గాలి చొరని డబ్బాలో భద్రపరుచుకోవాలి. రెండు రోజులకోసారి ఈ నూనెను తలకు పట్టించి మర్దన చేయాలి. ఇలా కనీసం రెండు నెలల పాటూ చేస్తే చుండ్రు అదుపులోకి వస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.
- గుప్పెడు గులాబీరేకలు, కప్పు చొప్పున మునగాకు, కరివేపాకు, ఆముదం, కొబ్బరినూనె తీసుకుని మరిగించాలి. ఆ మిశ్రమం సగం అయ్యాక దాన్ని సీసాలో భద్రపరుచుకోవాలి. దీన్ని తలకు పెట్టుకుని మర్దన చేయాలి. ఆపై ఓ గంటాగి తలస్నానం చేస్తే మేలు. జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది. చుండ్రు నివారణ సాధ్యమవుతుంది.
మందారంతో చుండ్రును దూరం చేయండిలా..!
అధిక వేడి, జిడ్డు, పోషణ లోపించడం వంటి అనేక కారణాలు జుట్టుపై ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా చుండ్రుకి కారణమవుతాయి. దీన్ని అదుపులో ఉంచాలంటే...
మందారంతో చుండ్రును దూరం చేయండిలా..!