ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

అతివల హాట్​ ఫేవరేట్.. టైనీ బ్యాగులు - tiny bags trend

‘పట్టి చూస్తే పిడికెడంత కూడా లేవు. కొన్నేమో మరీ అరచేతిలో నాలుగు బ్యాగులు పట్టేస్తున్నాయి. పోనీ పిల్లలు బొమ్మలకు తగిలించే బ్యాగులా... అనుకుంటే అదీ కాదు. పెద్దవాళ్లు చేతికి కట్టుకుని తిరిగేస్తున్నారు...’ ఇక్కడ కనిపించే ‘టీనీ టైనీ’ బ్యాగుల గురించి పరిచయం లేనివాళ్లు ఇలా అనుకోవడంలో ఆశ్చర్యంలేదు. కానీ ఫ్యాషన్‌ తెలిసినవాళ్లకు మాత్రం ఇవి ప్రస్తుతం హాట్‌ ఫేవరెట్లు.

women favourite tiny bags
టీనీ టైనీ

By

Published : Jan 11, 2021, 11:58 AM IST

లెచిక్విటొ... నాలుగు అంగుళాల ఎత్తు, రెండు అంగుళాల వెడల్పూ ఉన్న బ్యాగ్‌. ధర 495 డాలర్లు(సుమారు రూ.36 వేలు). ఫ్రెంచి డిజైనర్‌ సైమన్‌ పొర్టె జాక్వెమస్‌ ఏడాది కిందట ఈ బ్యాగుని మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడు ఆశ్చర్యపోనివాళ్లు లేరు. కొందరేమో ‘భలే ముద్దుగా ఉంది’ అని ఫొటోలు తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేస్తే... మరికొందరు ‘ఆ అది ఇన్‌స్టాలో పోస్టులకి తప్ప ఇంకెందుకు పనికొస్తుంది...’ అన్నారు వెక్కిరింపుగా. దీనిచుట్టూ ఫ్యాషన్‌ మీడియాలో బోలెడన్ని జోకులూ పుట్టుకొచ్చాయి.

కానీ ఫ్యాషన్‌ పోకడను అంచనా వెయ్యడం ఎవరితరమూ కాదు. ఏది ఎప్పుడు ఎందుకు ట్రెండ్‌ అవుతుందో కూడా చెప్పలేం. అలాగే ఇప్పుడా టైనీ బ్యాగు ఇన్‌స్టాతో పాటు హాలీవుడ్‌లోనూ క్రేజీ అయిపోయింది. దాంతో ప్రముఖ ఫ్యాషన్‌ కంపెనీలన్నీ రకరకాల బుల్లి బుల్లి బ్యాగుల్ని తయారుచెయ్యడం మొదలుపెట్టాయి. దుకాణాలూ వాటికోసం ప్రత్యేక కౌంటర్‌ని తెరిచాయి. ఇంకేముందీ అరచేతిలో పట్టే ఆ బ్యాగులు 2021 ఫ్యాషన్‌ ట్రెండ్‌లలో చోటు సంపాదించేశాయి.

అతివల హాట్​ ఫేవరేట్ టీనీ టైనీ బ్యాగ్స్

చిన్న... కొంచెం చిన్న... మరీ చిన్న..!

‘అంత చిన్న బ్యాగుల్లో అసలేం పడతాయి...’ అన్న మాటకి ఇక్కడ చోటే లేదు. ఎందుకంటే ‘ఫ్యాషన్‌ వేరు... ఉపయోగం వేరు’ అన్నది ఈ బ్యాగులకు ఫిదా అయిపోయిన కుర్రకారు మాట. ‘అయినా ఆఫీసులకెళ్లే టప్పుడైతే బ్యాగుల్లో వాటర్‌ బాటిల్‌ పట్టాలి, స్నాక్స్‌, శానిటైజర్‌ ఉండాలి కానీ... సరదాగా ఫ్రెండ్స్‌తో పార్టీలకెళ్లేటప్పుడు అవన్నీ కాదు, ఉండాల్సింది బ్యాగులు ట్రెండీగా’ అంటూ వారికి ఫుల్‌ సపోర్ట్‌ చేసేస్తున్నారు ఫ్యాషన్‌ గురూలు. అందుకే, జాక్వెమస్‌ మొదట తెచ్చిన బ్యాగుల కంటే సైజు మరింత తగ్గించి అరచేతిలో నాలుగు బ్యాగులు పట్టేలా కొత్తవాటిని తీసుకొస్తే... అవికూడా హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయట. ఈ తరహా బ్యాగుల్లో ఏమీ పట్టవు. ఫ్యాషన్‌గా తగిలించుకోవడానికే పనికొస్తాయి. కాకపోతే కనీసం క్రెడిట్‌ కార్డులూ నాలుగు నోట్లూ చిన్న లిప్‌స్టిక్‌, మాయిశ్చరైజర్‌ అయినా పడితే బాగుండును కదా... అనుకునేవారి కోసం వేరు వేరు కంపెనీలు మైక్రో, టైనీ బ్యాగులతో పాటు, కొద్దిగా సైజు పెంచి హ్యాండ్‌ బ్యాగుల్ని తీసుకొస్తున్నాయి. ఈ తరహా బ్యాగుల్ని ధరించడంలో కూడా బోలెడు స్టైల్స్‌ వచ్చేశాయి. కొందరు చేత్తో పట్టుకుంటే మరికొందరు ముంజేతికి కట్టుకుంటున్నారు. ఇంకొందరు మెడలో నెక్లెస్‌లానూ భుజానికీ వేసుకుంటున్నారు.
బుల్లి బుల్లి బ్యాగులు భలే ముద్దొస్తున్నాయి కదూ..!

ఇదీ చూడండి :

ఆ ఊరు.. గూగుల్ మ్యాప్​లో వెతికినా దొరకదు..కానీ!

ABOUT THE AUTHOR

...view details