ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

పెళ్లికి ముందు రోజు ఇలా చేయండి..!

పెళ్లిలో ప్రతి వధువూ చక్కందాల చుక్కలా కనిపించాలనే కోరుకుంటుంది. ఎందుకంటే అది జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే వేడుక కాబట్టి..! అందుకే వివాహ సమయంలో ప్రత్యేకంగా కనిపించాలని ప్రతి ఒక్క పెళ్లికూతురూ ఆశిస్తుంది. కొన్ని చిన్నచిన్న తప్పులే ఆమెకుఉన్న అందాన్ని చెడగొట్టి.. పెళ్లిరోజు చక్కగా కనిపించకుండా చేస్తాయి. అలసిపోయినట్లుగా, నిర్జీవంగా కనిపించేలా చేస్తాయి. ఇలా కాకుండా పెళ్లికి ముందు రోజురాత్రి కొన్ని చిట్కాలు పాటించి.. అందంగా మెరిసిపోవచ్చు. పెళ్లిరోజు ప్రకాశవంతంగా వెలిగిపోవచ్చు. మరి... ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం రండి.

marriage before day tips

By

Published : Nov 23, 2019, 9:55 AM IST

తలస్నానం చేసేయండి..
చాలామంది పెళ్లిరోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఆ తర్వాత జుట్టును డ్రైయర్‌తో ఆరబెట్టుకుంటారు. దీనివల్ల జుట్టు పొడిబారిపోయినట్లుగా కనిపిస్తుంది. అందుకే పెళ్లికి ముందురోజు రాత్రే తప్పనిసరిగా తలస్నానం చేయాలి. దీనివల్ల తలలో ఉన్న మురికి పూర్తిగా పోవడమే కాదు.. మర్నాడు జుట్టు పట్టులా మెరిసిపోతూ కనిపిస్తుంది. చాలా సిల్కీగా, ముట్టుకుంటే జారిపోయేలా ఉండే ఆ జుట్టు మీకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది.

వీటితో శుభ్రం..
మన అందాన్ని ఎక్కువగా డామినేట్ చేసేది మన చిరునవ్వు. ఎంత క్లీనింగ్, ఫ్లాసింగ్ చేయించుకున్నా.. పళ్లు కాస్త్తెనా పచ్చగా కనిపించే అవకాశముంది. అందుకే పెళ్లి ముందురోజు రాత్రి ఉప్పు, బొగ్గు వంటి పదార్థాలతో ఒకసారి పళ్లను శుభ్రం చేసుకోవడం మంచిది. దీనివల్ల దంతాలపై ఉండే పసుపుపచ్చదనం తొలగిపోతుంది. మీరు చిరునవ్వు నవ్వినప్పుడు తెల్లని ముత్యాల్లాంటి పళ్లు మీ ముఖానికి మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. బొగ్గుతో శుభ్రం చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం. లేదంటే పళ్ల సందుల్లో బొగ్గు అవశేషాలు అంటుకొని నల్లగా కనిపించే అవకాశం ఉంది.

తేమనందించండి..
పెళ్లిరోజు మన మేను అందంగా, ఫ్రెష్‌గా మెరిసిపోవాలంటే దానికి తగిన మాయిశ్చరైజర్ తప్పనిసరి. అందుకే మీ చర్మ తత్వానికి సరిపడే మాయిశ్చరైజర్‌ని ఎంచుకొని పెళ్లి ముందు రోజు రాత్రి తల నుంచి కాళ్ల వరకూ పూర్తిగా రాసుకోండి. దీనివల్ల మీ శరీరం ఎక్కడా పొడిబారిపోయినట్లుగా కనిపించకుండా జాగ్రత్తపడచ్చు. అయితే చర్మానికి కేవలం బయట నుంచి మాయిశ్చరైజింగ్ అందిస్తే సరిపోదు.. లోపలి నుంచి కూడా తేమను అందించాలి. దీనికోసం వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి.

కొద్దిగా స్క్రబ్..
పెళ్లికి ముందు స్క్రబ్ చేయడం సరికాదని మనందరికీ తెలుసు. అయితే కాస్త మైల్డ్‌గా చర్మాన్ని రుద్దుకోవడం వల్ల ఫేషియల్ చేసుకున్న తర్వాత మిగిలిన మృత చర్మం కూడా తొలగిపోతుంది. దీనికోసం శెనగపిండిలో కొబ్బరినూనె వేసి బాగా రుద్దుకోవాలి. ఆ తర్వాత చక్కటి క్లెన్సర్‌తో ముఖాన్ని కడుక్కోవాలి. దీనివల్ల చర్మంపై మృతచర్మం తొలగడమే కాదు.. తగిన మాయిశ్చరైజేషన్ అంది చర్మం మెరుస్తుంది.

నిద్ర తప్పనిసరి..
పెళ్లికి ముందురోజు రాత్రి చాలామంది మెహెందీ పెట్టించుకోవడం, లేదా మేకప్ సిద్ధం చేసుకోవడం, బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం, బంధువులతో మాట్లాడుతూ గడపడం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ ముందుగానే చేసుకొని తప్పనిసరిగా 8 గంటల పాటు నిద్రపోవడం అవసరం. లేదంటే పెళ్లిరోజు కళ్ల కింద నల్లని వలయాలు కనిపించే అవకాశాలుంటాయి. అందుకే పెళ్లిలో ఫ్రెష్‌గా కనిపించాలంటే కనీసం 8 గంటలు నిద్రపోవడం తప్పనిసరి.

ABOUT THE AUTHOR

...view details