ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

టిక్ టాక్ చేసింది.. టికెట్.. పట్టేసింది.. ! - MLA's TICKET TO TIK TOK STAR

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న టిక్ టాక్ వీడియోలను అందరూ చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన వీడియో షేరింగ్ యాప్ అది. కొంత మంది టిక్ టాక్ వీడియోలతోనే సోషల్ మీడియా స్టార్లు కూడా అయిపోయారు. హరియాణలో ఒకావిడ టిక్ టాక్ చేసి ఎమ్మెల్యే టికెట్ కూడా సంపాదించేసింది.

సోనాలీ ఫోగాట్

By

Published : Oct 4, 2019, 3:42 PM IST

సోనాలీ ఫోగాట్

సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ఎంత ప్రాచుర్యం పొందిందో నేటి తరానికి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యువత తోపాటు, గృహిణులు, పెద్దలు అందరూ టిక్ టాక్ వీడియోలు తీస్తున్నారు. తాము పోస్ట్ చేసిన బెస్ట్ వీడియోలకు లైక్స్, కామెంట్స్ రావడం..ఫాలోవర్స్ పెరగడం వల్ల విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటున్నారు.

ఇప్పుడు అదే క్రేజ్​ ఒక మహిళకు ఎమ్మెల్యే టిక్​ట్​ రావడానికి కారణమైంది. హరియాణా శాసనసభ ఎన్నికల్లో ఓ టిక్​టాక్​ స్టార్​కు భాజపా ఎమ్మెల్యే టికెట్​ కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
రెండోసారి విడుదల చేసిన జాబితాలో ఆదంపుర్‌ నియోజకవర్గ స్థానాన్ని ప్రముఖ టిక్‌టాక్‌ స్టార్‌ సోనాలీ ఫొగాట్‌కు కేటాయించింది.

"భారతీయ జనతా పార్టీ నా మీద విశ్వాసం ఉంచి..ఆదంపుర్​​ నియోజకవర్గ టికెట్​ ఇచ్చింది. నాకు ఓ అవకాశం కల్పించింది. మేము (భాజపా నాయకులు) నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధికి.. హరియాణా వికాసానికి ఎంతో ప్రయత్నిస్తున్నాము. ఎప్పుడు వచ్చానని అసలు ఆలోచించడం లేదు.. ఇక్కడ విజయం సాధిస్తాను. కమలం వికసించి తీరుతుంది." - సోనాలీ ఫొగాట్​, భాజపా అభ్యర్థి

సోనాలీ ఫొగాట్‌కు టిక్‌టాక్‌లో లక్షకుపైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. నిత్యం ఆమె తన వీడియోలను పోస్ట్‌చేస్తూ పేరు సంపాదించుకున్నారు. ఈ మధ్య కాలంలో సోనాలీ టిక్ టాక్ వీడియోలు వైరల్‌గా కూడా మారాయి. ఆమెకు ఆన్‌లైన్‌ అభిమానులు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు బలం ఉన్న ఈ నియోజకవర్గంలో ఆమెకు గట్టి పోటీనే ఎదుర్కోవలసి ఉంటుందని సమాచారం.

ఈ స్థానం నుంచి 1969 నుంచి వరుసగా 8సార్లు మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ గెలిచారు. ఆ తర్వాత 1987, 1998ల్లో ఆయన భార్య జస్మాదేవి, కుమారుడు కులదీప్‌ బిష్ణోయ్‌ ఒక్కోసారి గెలిచారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో బిష్ణోయ్‌ కుటుంబ ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ స్థానాన్ని సోనాలీ ఫొగాట్‌కు కేటాయించినట్లు తెలుస్తోంది.

హరియాణా శాసనసభకు అక్టోబర్‌ 21న ఎన్నికలు జరగనుండగా అక్టోబర్‌ 24న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి:మారిషస్​లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ

ABOUT THE AUTHOR

...view details