ETV Bharat / lifestyle
'మోదీ.. టైమొచ్చింది...హోదా ఇచ్చేయండి' - on
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తగిన ప్రాధాన్యం దక్కలేదని నటుడు మంచు మనోజ్ ప్రధాని మోదీపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.


2
By
Published : Feb 2, 2019, 1:10 PM IST
| Updated : Feb 2, 2019, 2:49 PM IST
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం దక్కలేదని నటుడు మంచు మనోజ్ ప్రధాని మోదీపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు
. ‘మేం మీకు మద్దతుగా నిలిచాం.మీ పోరాటంలో తోడుగా నడిచాం.ఇన్నాళ్లు మా ఆశల్ని నెరవేరుస్తారని ఎదురు చూశాం.కానీ మీ నుంచి సరైన స్పందన రాలేదు.ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమేకాక బడ్జెట్‌లో కనీస గౌరవం దక్కలేదు.సమయం ఆసన్నమైంది.మా డిమాండ్‌ను గౌరవిస్తూ..ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇవ్వండి.తిరుపతి బాలాజీ సాక్షిగా చేసిన హామీని నేరవేర్చకపోతే స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు’ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. Last Updated : Feb 2, 2019, 2:49 PM IST