ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

రెండోరోజు మేడారం జాతర.. మొక్కులు చెల్లించుకున్న సీతక్క - రెండో రోజు మేడారం జాతర... మొక్కులు చెల్లించుకున్న సీతక్క

మేడారం జాతర రెండోరోజు సాగుతోంది. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కుటుంబసమేతంగా సమక్క-సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

medaram jathara second day
రెండోరోజు మేడారం జాతర..

By

Published : Feb 25, 2021, 1:24 PM IST

తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న జాతర రెండో రోజు భక్తులతో కిటకిటలాడింది. సమ్మక్క-సారలమ్మ సన్నిధికి జనాలు పోటెత్తారు. దేవాలయ గేటు-3 మూసివేయటం వల్ల వనదేవతలను భక్తులు బయట నుంచే దర్శించుకుంటున్నారు. గద్దెల లోపల ఉన్న పూజారులు భక్తులకు పసుపుకుంకుమలు అందిస్తున్నారు.

ములుగు ఎమ్మెల్యే సీతక్క.. కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకున్నారు. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని సీతక్క తెలిపారు. చిన్నచిన్న గిరిజన దేవాలయాలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేయాలని.. రెండేళ్లకోసారి జరిగే పెద్ద జాతరకు నిధులు మంజూరు చేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

రెండోరోజు మేడారం జాతర..

ఇదీ చూడండి: చాముండీ పాత్రలో లీనమై 'మహీషుడి'పై హత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details