మహరాజ సంగీత నృత్య కళాశాల శతాబ్ధి ఉత్సవాలు విజయనగరంలోని మహరాజ సంగీత నృత్య కళాశాల వంద ఏళ్లు పూర్తి చేసుకుని 101 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. నేటితో ఆ కళాశాల శతాబ్ధి ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ వేడుకలో నిర్వహించిన పలు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. అధిక సంఖ్యలో పూర్వ విద్యార్ధులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ప్రధానంగా మైమరిపించే మృదంగ వాయిద్యం తో పాటు, కళాశాల విద్యార్ధులు ఆలపించిన సంగీత సర్వగాత్ర కచేరి, తెలుగు గజల్స్ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి.