ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఆస్తి తగాదాలు: గొడ్డలితో అన్నను హత్య చేసిన తమ్ముడు - ఆస్తి తగాదాలు

అన్న చిన్నప్పను తమ్ముడు చంద్రశేఖర్ గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్​లో కలకలం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అన్నను గొడ్డలితో హత్య చేసిన తమ్ముడు
అన్నను గొడ్డలితో హత్య చేసిన తమ్ముడు

By

Published : Oct 15, 2020, 6:04 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం గాజుల మాల్లాపురంలో హత్య కేసు నమోదైంది. మద్యం మత్తులో వరుసకు అన్న అయ్యే చిన్నప్పని తమ్ముడు చంద్రశేఖర్ గొడ్డలితో నరికి చంపాడు. అడ్డొచ్చిన మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.

ఆస్తి తగాదాలు..

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదా వల్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని గ్రామస్థులు భావిస్తున్నారు. హత్య జరిగిన వెంటనే నిందితుడు పరారైనట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి:

దేవస్థానం పక్కన అసభ్యకార్యకలాపాలు.. అడ్డుచెప్పిన వాచ్​మన్​పై దాడి

ABOUT THE AUTHOR

...view details