త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువతి అకస్మాత్తుగా శవమై తేలింది. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
ఏం జరిగింది?
భూంపల్లికి చెందిన వాగుమారి ప్రవళిక (26) బావిలో దూకి శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. వాగుమారి చందర్ రావుకు ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేశారు. చిన్న కూతురు ప్రవళికకి తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన యువకునితో పెళ్లి కుదిరింది. వరకట్నంగా రూ.8లక్షలు, నాలుగు గుంటల భూమిని ఇవ్వడానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించారు. బంధువుల సమక్షంలో ఈనెల 3న నిశ్చితార్థం జరిగింది. అప్పటికే ఇద్దరు అక్కల పెళ్లిళ్లు చేసి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండటం, తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండటం, తన పెళ్లి జరిగితే కుటుంబంపై ఆర్థిక భారం పడుతుందని భావించిన ప్రవళిక ఆవేదనతో వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.
చివరగా...