నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం శివారులో లారీ కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఎడ్లూరుపాడుకు చెందిన పేరం వెంకట్రావ్ (23) ఓ మైనర్ బాలికను ప్రేమించాడు. తల్లిదండ్రులు మందలించగా... ఇద్దరూ కలిసి పారిపోయారు. అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేయగా... హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు.
వికారంగా ఉందని కారు దిగి... లారీ కింద పడ్డాడు - crime news in nalgonda
ప్రేమించుకున్నారు. పెద్దలొప్పుకోలేదని పారిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పట్టుకుని స్వగ్రామానికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే తనకు వికారంగా ఉందని కారు దిగి వాంతి చేసుకున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ కింద పడిపోయాడు. ఇదేదో సినిమా స్టోరీ కాదు... తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో జరిగిన ఆత్మహత్య వెనుక ఉన్న కథ.
అమ్మాయి తల్లిదండ్రులు, ఏఎస్ఐతో పాటు పోలీసు సిబ్బందితో హైదరాబాద్‌కు వచ్చి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ప్రకాశంకు తీసుకెళ్తున్న క్రమంలో మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామ శివారులోకి రాగానే వెంకట్రావు కడుపులో వికారంగా ఉందని చెప్పాడు. రెండు సార్లు వాంతులు చేసుకున్నాడు. అంతలోనే ఎదురుగా వస్తున్న లారీకి అడ్డంగా వెళ్లి ఆత్మహత్యకు యత్నించాడు. లారీ ఢీకొనగా... తీవ్రగాయాలపాలైన వెంకట్రావ్‌ను హుటాహుటిన మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే వెంకట్రావ్ చనిపోయాడు.