ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దర్శి మండలం చెరువుకొమ్ముపాలేనికి చెందిన ఇస్తాల హరిబాబు (30) గుంటూరు జిల్లా నూజెండ్ల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 18 వ తేదీన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై కార్యాలయానికి బయల్దేరి వెళ్లాడు. మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. ఈ క్రమంలో శనివారం పెద ఉల్లగల్లు పొలాల్లో శవమై కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆ ప్రాంతంలో పురుగులమందు డబ్బా, శీతలపానీయం, మద్యం సీసాలను గుర్తించారు.
పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య - ప్రకాశం జిల్లా నేర వార్తలు
'నన్ను క్షమించండి... నేను నలుగురిలో తిరగలేకపోతున్నా... జీవితం మీద విరక్తి కలిగి.... ఆత్మహత్య చేసుకుంటున్నా'..అంటూ లేఖ రాసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలంలో చోటుచేసుకుంది.
'నన్ను క్షమించండి నేను నలుగురిలో తిరగలేకపోతున్నా... జీవితం మీద విరక్తి కలిగి.... ఆత్మహత్య చేసుకుంటున్నా... అమ్మ, నాన్న, అక్క, బావ, అన్న వదినలు, పిల్లలు జాగ్రత్త' అంటూ రాసి ఉన్న ఓ లేఖ మృతుని వద్ద లభించింది. వ్యక్తిగత కారణాలతో మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి చనిపోయినట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోష్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు, బందువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
ఇవీ చదవండి:ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు... నీటి గుంటలో శవమై తేలాడు!