"అమ్మా... నాకు బతకాలని లేదు, నేను చనిపోతున్నా" అంటూ తల్లికి ఫోన్ చేసి నదిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజోలి గ్రామానికి చెందిన మెయిబు.. పదో తరగతి పూర్తి చేసి మగ్గం నేస్తూ తల్లికి తోడుగా ఉంటున్నాడు.
కొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయాడని.. చనిపోతానంటూ తిరుగుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఒకసారి చేయి కోసుకున్నాడని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం బయటకు వెళ్తున్నానని చెప్పి రాజోలిలోని నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.