భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సుదిమల్ల ఎస్బీహెచ్ ఏటీఎం వద్ద ఒక యువకుడు సింగరేణి ఉద్యోగిని బురిడి కొట్టించాడు. ఏటీఎం సెంటర్లో రూ.40 వేలు దొంగిలించాడు. సింగరేణి ఉద్యోగి కొలుకుల అర్జున్ రావు... ఏటీఎం కార్డు తీసుకొని డబ్బుల కోసం సుదిమల్ల ఎస్బీఐ ఏటీఎం కేంద్రానికి వెళ్ళాడు.
అర్జున్రావుకు డబ్బులు తీయడం రాకపోవడం వల్ల అక్కడే ఉన్న ఒక యువకుడికి ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బులు తీసివ్వమని కోరాడు. అర్జున్ రావు... తన పిన్ నంబర్ చెప్పటం వల్ల యువకుడు దాన్ని తప్పుగా కొట్టి డబ్బులు రావట్లేదని అబద్ధం చెప్పాడు. ఏటీఎం కార్డు మార్చి అర్జున్రావుకు వేరే కార్డు ఇచ్చాడు. దాన్ని గమనించకుండా... అర్జున్ రావు ఇంటికి వెళ్లిపోయాడు.