తెలంగాణలోని వికారాబాద్ పట్టణానికి చెందిన దీపిక, అఖిల్... 2016లో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం దీపిక తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం వల్ల రెండు సంవత్సరాల క్రితం ఇంటికి తీసుకొచ్చారు. అందులో భాగంగానే శనివారం నాడు ఇద్దరూ వికారాబాద్ కోర్టుకు హాజరయ్యారు.
ఆదివారం సాయంత్రం సోదరితో కలిసి షాపింగ్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా... భర్త, మరో ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి దీపికను లాక్కొని వెళ్లారు. దీపిక కుటుంబసభ్యులు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ సంజీవరావు సిబ్బందితో కలిసి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడించేందుకు కుటుంబసభ్యులు నిరాకరిస్తున్నారు.