ప్రేమికుల రోజుకు ఒక రోజు ముందే ఓ యువకుడు తనువు చాలించాడు. ప్రేయసి తనకు దక్కలేదన్న మనస్తాపంతో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొందుర్గ్కు చెందిన విజయ్ ఓ చాక్లెట్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం.. విజయ్ ప్రేమించిన యువతి పెళ్లి వేరే వ్యక్తితో జరుగుతుండడం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం కూడా పనికి వెళ్లకుండా షాద్నగర్లోనే విజయ్ గడిపినట్లు తల్లిదండ్రులు తెలిపారు. మృతుడు తండ్రి కృష్ణయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ: ప్రేయసికి పెళ్లి.. రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య - rangareddy crime news
తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో ఓ ప్రేమికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ప్రేయసికి వేరే వ్యక్తితో వివాహం జరుగుతుండడం వల్ల మనస్తాపానికి గురై షాద్నగర్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రేయసికి పెళ్లి.. రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య