ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య.. - నల్గొండ తాజా వార్తలు

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్​బోర్డు కాలనీలో చోటుచేసుకొంది.

women-committed
women-committed

By

Published : Dec 3, 2020, 7:44 AM IST

తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదం చోటుచేసుకొంది. వివాహిత ప్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు తెలిపారు.భువనగిరికి చెందిన బాలు, జనగామ జిల్లావాసి శిల్పకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. మిర్యాలగూడలో బాలు ఎలక్ట్రిషన్​గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఆరునెలల కుమార్తె ఉంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details