ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

తెలంగాణ: దిశ తరహా ఘటన.. అత్యాచారం, హత్య - disha news

మొన్న దిశ ఘటన మరవక ముందే అదే తరహాలో రంగారెడ్డి జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు... గల్లీకో గాంధారి పుత్రుడు పుట్టుకొస్తున్నాడు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఈ ఘటనలు ఆగడం లేదు. తాజాగా తంగడపల్లి సమీపంలోని వంతెన వద్ద ఓ మహిళను హత్యాచారం చేసిన ఘటన అందరిని కలచివేస్తోంది.

murdered
murdered

By

Published : Mar 17, 2020, 3:29 PM IST

రంగారెడ్డి జిల్లాలో దిశ తరహా ఘటన.. మహిళపై అత్యాచారం, హత్య

తెలంగాణ.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దిశ ఘటన తరహాలో మరో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఘటనా స్థలికి డీసీపీ ప్రకాశ్​రెడ్డి, ఏసీపీ రవీందర్​రెడ్డి చేరుకుని ఘటనపై ఆరా తీశారు.

మహిళ 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని.. ఎక్కడో హత్యాచారం చేసి ఇక్కడ పడవేశారని డీసీపీ ప్రకాశ్​రెడ్డి తెలిపారు. వికారాబాద్​, రంగారెడ్డి, హైదరాబాద్​, రాచకొండ పరిధిలో అదృశ్య కేసులు నమోదయ్యాయా అనే వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. క్లూస్​ టీం, డాగ్​స్వ్కాడ్​ బృందంతో ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. మహిళకు సంబంధించిన వస్తువులు కానీ, దుస్తులు కానీ ఘటనా స్థలంలో లభించకపోవడం వల్ల ఆమె వివరాలు సేకరించడం కష్టంగా మారిందని వివరించారు.

ఇదీ చదవండి:స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎస్​కు ఎస్​ఈసీ లేఖ

ABOUT THE AUTHOR

...view details