ప్రియుడి ఇంటి ఎదుట వివాహితురాలు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ పురుగుల మందు డబ్బాతో బైఠాయించింది. ఈ సంఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా వంకరపట్నం మండలం అంబాల్‌పూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో సహజీవనం చేశాడు. ఈ విషయం బయటకు పొక్కటం వల్ల వివాహిత భర్త ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. ఆమె తల్లిదండ్రులు కూడా నిరాకరించారు.
ప్రియుడి ఇంటి ఎదుట.. వివాహితురాలు ఆందోళన - woman protest in front of lovers house latest news
ప్రియుడి ఇంటి ఎదుట వివాహితురాలు ఆందోళనకు దిగిన సంఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా అంబాల్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. తనకు న్యాయం జరిగేంతవరకు అక్కడే కూర్చుంటానని నిరసన వ్యక్తం చేసింది.
![ప్రియుడి ఇంటి ఎదుట.. వివాహితురాలు ఆందోళన ప్రియుడి ఇంటి ఎదుట వివాహితురాలు ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9085101-808-9085101-1602069363589.jpg)
ప్రియుడి ఇంటి ఎదుట వివాహితురాలు ఆందోళన
కేశవపట్నం పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆమె తన ఇద్దరు చిన్నారులతో కలిసి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం చేయాలంటూ అతని ఇంటి ముందు కూర్చుంది. తన దగ్గరకు వస్తుందని తెలుసుకున్న సదరు ప్రియుడు ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఇంటి తాళం పగులగొట్టి అక్కడే ఆమె నిరసనకు దిగింది. న్యాయం జరిగేంత వరకు అక్కడే ఉంటానని చెబుతోంది.