ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

టిప్పర్​ ఢీకొని మహిళ మృతి - సూరారం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు దాటుతుండగా టిప్పర్​ ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన తెలంగాణలోని మేడ్చల్​ జిల్లా సూరారంలో జరిగింది. విధులకు వెళ్తూ రోడ్డు దాటుతున్న సమయంలో ఆకస్మాత్తుగా వచ్చిన టిప్పర్ ఆమెను ఢీకొట్టింది. లారీ డ్రైవర్​ పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

women died at suraram
టిప్పర్​ ఢీకొని మహిళ మృతి

By

Published : Dec 30, 2020, 3:20 PM IST

విధులకు వెళ్తుండగా రోడ్డు దాటుతున్న సమయంలో టిప్పర్​ ఢీకొని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తెలంగాణలోని మేడ్చల్​ జిల్లా సూరారంలో జరిగింది. మేడ్చల్​ జిల్లా జీడిమెట్లకు చెందిన సుశీలమ్మ(54).. సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో హౌస్​ కీపర్​గా పనిచేస్తోంది. బుధవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఆస్పత్రి ఎదురుగా రోడ్డు దాటుతుండగా అకస్మాత్తుగా వచ్చిన టిప్పర్​ ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న దుండిగల్​ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్​ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

టిప్పర్​ ఢీకొని మహిళ మృతి

ABOUT THE AUTHOR

...view details