తెలంగాణ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. విమానాశ్రయానికి వెళ్లేదారిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు - telangana crime news
తెలంగాణ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేదారిలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభించింది. మహిళను హత్య చేసి దుండగులు.. ఆ తర్వాత పెట్రోల్ పోసి తగులబెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
గుర్తుతెలియని మహిళను హత్య చేసి దుండగులు.. ఆ తర్వాత పెట్రోల్ పోసి తగులబెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ వయస్సు 35-40 ఏళ్లు ఉంటుందని తెలిపారు. ఆమెను ఎక్కడ హత్య చేశారనే కోణంలో విచారిస్తున్న పోలీసులు సీసీకెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు.