ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

గ్రానైట్ ఎగుమతుల్లో అక్రమాలు... ఆరు వాహనాలపై కేసులు... - prakasham district granite exports News today

ప్రకాశం జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్‌ పరిధిలోని గ్రానైట్‌ పలకల ఎగుమతుల్లో అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఇంకొల్లు సీఐ అల్తాఫ్‌ హుస్సేన్‌ హెచ్చరించారు. మార్టూరు ప్రాంతంలో ఇటీవలే ఆరు గ్రానైట్‌ వాహనాలపై కేసులు నమోదు చేశామన్నారు.

గ్రానైట్ ఎగుమతుల్లో అక్రమాలకు పాల్పడితే కేసులే : సీఐ హుస్సేన్
గ్రానైట్ ఎగుమతుల్లో అక్రమాలకు పాల్పడితే కేసులే : సీఐ హుస్సేన్

By

Published : Sep 24, 2020, 5:27 PM IST

ప్రకాశం జిల్లా మార్టురు ఠాణా పరిధిలోని గ్రానైట్ పరిశ్రమల్లో ఎగుమతులకు సంబంధించి నియమ నిబంధనలకు అనుగుణంగానే నడుచుకోవాలని ఇంకొల్లు సీఐ అల్తాఫ్ హుస్సేన్ సూచించారు. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రెండోసారి చేస్తే కేసులే..

బిల్లులు సక్రమంగా లేక మైనింగ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్తే.. సుమారు రూ.20 లక్షల అపరాధ రుసుం విధించారని సీఐ పేర్కొన్నారు. మళ్లీ అదే తప్పును రెండోసారి పునరావృతం చేసినందుకు నలుగురిపై కేసులు నమోదు చేశామని ఆయన స్పష్టం చేశారు. ఇకపై బిల్లులు లేకుండా రవాణా చేస్తే.. ట్రేడర్‌తోపాటు లారీ సప్లై ఆఫీస్‌, పరిశ్రమ యజమానులపైనా కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. సమావేశంలో ఎస్సై, శివకుమార్‌, ఏఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చూడండి : ప్రైవేటు ఆసుపత్రిలో కొవిడ్ బాధితుడి మృతి.. బంధువుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details