ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

భర్త ఇంటి ముందు కూతురితో కలసి భార్య ఆందోళన

పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.. కాపురం చేసి ఓ కూతురిని కన్నాడు. ఇంతలో భార్యను, కన్న కూతురిని అమెరికాలో వదిలివేసిన వచ్చాడు ఓ‌ ఎన్నారై. అనంతరం తిరిగి వచ్చిన భార్య , కూతురు భర్త ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. అసలేం జరిగిందంటే..?

wife-with-daughter-protest
wife-with-daughter-protest

By

Published : Nov 13, 2020, 12:35 AM IST

హైదరాబాద్​ ప్రగతి నగర్​కు చెందిన‌ నాగ శిరీషకు కూకట్‌పల్లి జయానగర్​లో నివసించే వీరం నాగ వేంకట‌ ప్రసాద్ రావుకు 2008లో వివాహం జరిగింది. పెళ్లి జరిగే సమయానికి ప్రసాద్ రావు అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లైన రెండు నెలలకే భార్యాభర్తలు అమెరికా న్యూజెర్సీలో కాపురం పెట్టారు, మొదటి నుంచే భర్త వెంకట ప్రసాద్ రావు, భార్యపై అనుమానంతో వేధింపులకు పాల్పడటం మొదలుపెట్టాడని నాగ శిరీష తెలిపింది.

భర్త ఇంటి ముందు కూతురితో కలసి భార్య ఆందోళన

కూతురు పుట్టినా వేధింపులు ఆపకుండా, భార్యను కూతురుని ప్రసాద్ రావు వదిలేసి 2016లో హైదరాబాద్​కి వచ్చాడు. వచ్చిన కొద్ది రోజులకే భార్యకు సమాచారం ఇవ్వకుండా ప్రసాద్ రావు విడాకులకు దరఖాస్తు చేశాడు. కొద్ది రోజులకు విడాకుల కేసును వెనక్కి తీసుకున్నాడు. నాగశిరీష కూతురు యశస్వీని తీసుకొని హైదరాబాద్​లోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది.

ఈ రోజు భర్త ఇంటికి కూతురితో కలిసి నాగశిరీష రావటంతో ప్రసాద్ రావు‌ వాళ్లిందరిని ఇంటిలోనికి రానివ్వకుండా తాళం వేసుకోగా... ఇంటికి వచ్చిన నాగశిరీషపై చెప్పును చూపిస్తూ ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. దాంతో భార్య నాగశిరీష కూతురితో కలిసి ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగింది. సరైన కారణాలు లేకుండా తన భర్త తనకు విడాకులు ఇస్తానని, తనని తన కూతురిని వదిలేసి వచ్చాడని, తనకు న్యాయం చెయ్యాలని విజ్ఞప్తి చేసింది.

  • ఇదీ చూడండి:

నాపై జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆపండి: ఉండవల్లి శ్రీదేవి

ABOUT THE AUTHOR

...view details