ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

భర్తను హతమార్చి.. ఆపై ఏమీ తెలియనట్టు నటించి..! - తూర్పు గోదావరి క్రైమ్ న్యూస్

ఓ మహిళ.. తాను కట్టుకున్న భర్తనే హతమార్చింది. ఓ కుమార్తె ఉన్నా.. బిడ్డ భవిష్యత్ ఏమైపోతుందనే.. ఆలోచన లేకుండా భర్తను చంపేసింది. సహజ మరణంగా చిత్రీకరించేందుకు నానా ప్రయత్నాలు చేసింది.

wife killed husband in east godavari
wife killed husband in east godavari

By

Published : Sep 1, 2020, 3:43 PM IST

తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం అగ్రహారంలో ఓ మహిళ తన భర్తను హతమార్చి.. సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కుటుంబ సభ్యులను నమ్మించి దహన సంస్కారాలు సైతం పూర్తి చేయించింది. గ్రామస్థులకు అనుమానం వచ్చి నిలదీయగా.. తానే చంపేసినట్లు ఒప్పుకుంది.

ఈ ఘటన జరిగి రెండు రోజులైంది.. పోలీసులకు సమాచారం అందగా.. అమలాపురం డీఎస్పీ మసూద్ భాషా, ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్​పెక్టర్​, కాట్రేనికోన ఎస్ఐ.. నిందితురాలు ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది.

ABOUT THE AUTHOR

...view details