వాట్సాప్‌లో వచ్చిన ఓ ఫొటో బాలిక ఆత్మహత్యకు కారణం కాగా ఆమె తండ్రి ఆస్పత్రికి పాలయ్యేలా చేసింది. ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జడ్చర్ల మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన బాలిక.. అదే గ్రామానికి చెందిన మహమ్మద్ అనే యువకుడి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది.
ప్రాణం తీసిన వాట్సాప్ ఫొటో - minor girl suicide in jadcharla
వాట్సాప్‌లో వచ్చిన ఓ ఫొటో బాలిక ప్రాణం తీసింది. బాలిక తండ్రి ఆసుపత్రి పాలయ్యేలా చేసింది. ఈ ఘటన తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకుంది.
ఈ విషయంలో గతంలో పెద్దలు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తాజాగా వారం రోజుల క్రితం ఆమె తండ్రి వాట్సాప్‌లో వచ్చిన బాలిక అసభ్యకర ఫొటోలు కుటుంబంలో చిచ్చురేపాయి. ఈనెల 5న యువకుడిపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టగా.. ఇదే తరుణంలో ఈనెల 6న ఇంట్లో తండ్రి, కుమార్తె క్రిమిసంహారక మందు తాగారు. బాలిక మృతి చెందగా, ఆమె తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు నిందితుడు మహమ్మద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఫోన్లో వచ్చిన ఫొటో కారణాలు విచారిస్తున్నట్లు తెలిపారు.
- ఇదీ చూడండి:'అధీర పాత్ర కోసం గంటన్నర మేకప్'