మేడ్చల్ జిల్లా సైనిక్‌పురిలోని ఓ స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో లాకర్లు పగులగొట్టి వాచ్‌మెన్ దంపతులు చోరీకి పాల్పడ్డారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. బంగారు నగలు, వజ్రాలు, నగదు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వ్యాపారి ఇంట్లో చోరీ చేసిన వాచ్ మెన్ దంపతులు - మేడ్చల్ జిల్లా వార్తలు
తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా సైనిక్‌పురిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వాచ్‌మెన్ దంపతులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.2 కోట్ల విలువైన సొత్తు ఎత్తుకెళ్లినట్లు వ్యాపారి ఫిర్యాదు చేశారు.
సుమారు రూ.2 కోట్ల విలువైన సొత్తు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. 6 నెలల నుంచి వ్యాపారవేత్త ఇంట్లో వాచ్‌మెన్‌గా నేపాల్ వాసి భీమ్ పనిచేస్తున్నాడు. ఇంట్లోని ద్విచక్రవాహనాన్ని కిలోమీటరు దూరంలో వదిలివెళ్లాడు. కుషాయిగూడ చౌరస్తాలో ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాచ్‌మెన్, మరో మహిళ మూటతో వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. నిందితుల కోసం 5 బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి పబ్జీ ఆడిన తరువాత గుండె ఆగిపోయింది!