శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కొత్తకోట పంచాయతీ రాజులు భట్టుపాలెం గ్రామానికి చెందిన చిరంజీవి రాజు, సాయి సురేష్... గత నెల 18, 19 తేదీల్లో పట్టాదారు పాస్ బుక్‌లో తమ భూమి వివరాలు నమోదు కోసం మ్యూటేషన్, 1బీ కోసం మీ సేవలో దరఖాస్తు చేశారు. అప్పటి నుంచి వీఆర్వో జి. వెంకటరమణ లంచం డిమాండ్ చేశాడని దరఖాస్తుదారులు ఆరోపించారు. పని పూర్తి కావాలంటే తొలి విడతగా రూ.3 వేలు, పని అయిన తర్వాత మరో రూ.3 వేలు మొత్తం రూ. 6000 చెల్లించాలని అడిగినట్టు చెప్పారు.
ఒకేసారి మొత్తం చెల్లించాలి..
వారం కిందట మరోసారి వీఆర్వోని కలిస్తే ఒక్కసారే రూ.6,000 చెల్లించాలని లేకపోతే మ్యూటేషన్‌కు సంబంధించిన ఫైల్ రిజెక్ట్ చేస్తామని ముక్తకంఠంతో బదులిచ్చాడని బాధితులు తెలిపారు. ఫలితంగా దిక్కు తోచని స్థితిలో బాధితులు అనిశా అధికారులను ఆశ్రయించామన్నారు.