బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వాలంటీర్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన యద్ధనపూడి మండలం సురవరపుపల్లె గ్రామంలో జరిగింది. వాలంటీర్‌గా పని చేస్తున్న ఏ. రాజేష్.. మద్యం సేవించి రాత్రి 9 గంటలకు ఓ ఇంటి వద్దకు వెళ్లాడు. పొలం పాస్ బుక్, ఆధార్ కార్డు కావాలని అడిగాడు.
ఈ క్రమంలో ఇంటి యజమాని భార్య వాటిని తెచ్చేందుకు లోపలికి వెళ్లగా.. అక్కడే ఉన్న కుమార్తెతో వాలంటీర్ అసభ్యంగా ప్రవరించాడు. బాలిక కేకలు వేయటంతో.. ఆమె తల్లి అక్కడకు వచ్చి అడ్డుకోగా ఆమెపైనా దాడికి దిగాడు. బాధితురాలు మైనర్ అయినందున ఆమె ఫిర్యాదుపై పోలీసులు పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారు.