శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో.... పోలీసులు జరిపిన దాడుల్లో 350 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని పెద్దూరు కూడలి వద్ద నిర్వహించిన తనిఖీల్లో... సారా తరలిస్తున్న ఆటోను పట్టుకున్నట్టు ఎస్సై భాస్కర్రావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీని విలువ రూ. లక్షా 75వేలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు.
నాటుసారా పట్టివేత... ఇద్దరు వ్యక్తుల అరెస్టు - శ్రీకాకుళం నేర వార్తలు
అక్రమంగా సారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 350 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.
నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు