ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

విశాఖలో పలు నేరాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్ - visakha latest crime news

గతంలో పలు నేరాలకు పాల్పడిన నిందితులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లలో ఇద్దరు రౌడీ షీటర్లు కూడా ఉన్నట్లు డీసీపీ సురేష్ బాబు వెల్లడించారు.

Accused arrest by Vaisakha police
విశాఖలో పలు నేరాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్

By

Published : Nov 17, 2020, 4:56 AM IST

విశాఖలో వివిధ నేరాలకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని తెలుగు తల్లి ఫ్లై ఓవర్​పై దారిదోపిడీకి పాల్పడిన కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సురేష్ బాబు తెలిపారు. అందులో వాసుపల్లి చిన్నా అలియాస్ ఎలకడు, సాయికీర్తి అనే ఇద్దరు రౌడీ షీటర్లు ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి సెల్ ఫోన్, రోల్డ్ గోల్డ్ చైన్​ స్వాధీనం చేసుకున్నారు.

విశాఖలోని ఓ ఎమ్మెల్యే ఇంటిలో వివాహ వేడుకలో దొంగతనానికి పాల్పడిన నిందితుడ్ని సైతం అరెస్ట్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం యారాడ బీచ్​కు వెళ్లి పిట్టకొండ వద్ద చిక్కుకున్న ముగ్గురు యువకులను పోలీసులు సురక్షితంగా కాపాడారు. పోలీసులను డీసీపీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details