వరసకు కూతురైన మైనర్‌పై అత్యాచారం చేసి.. గర్భవతిని చేసిన ఘటన తెలంగాణ మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని ఓ మారుమూల తండాలో చోటుచేసుకుంది. 13 ఏళ్ల బాలిక మహబూబాబాద్ పక్క జిల్లాలో చదువుతోంది. కరోనా ప్రభావంతో పాఠశాలకు సెలవులు ఇవ్వడం వల్ల.. వరసకు బాబాయ్ అయిన వ్యక్తి ఇంటి వద్ద ఉంటోంది. బాలికను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పకుండా దాచిపెట్టింది.
వరసకు కూతురైన మైనర్‌ను గర్భవతి చేసిన బాబాయ్ - man raped minor in mahabubabad district
వరసకు కూతురైన మైనర్‌ను బాబాయే గర్భవతిని చేసిన ఘటన తెలంగాణ.. మహబూబాబాద్ జిల్లాలోని ఓ మారుమూల తండాలో జరిగింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసునమోదు చేసినట్లు సమాచారం.

uncle-who-conceived
మంగళవారం.. బాలిక కళ్లు తిరిగి పడిపోయింది. హుటాహుటిన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆమె తల్లిదండ్రులు. బాలికను పరీక్షించిన వైద్యులు గర్భవతి అని నిర్ధారించారు. బాధితురాలని తీవ్రంగా మందలించడం వల్ల.. ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి వివరాలు చెప్పింది. కురవి పోలీస్ స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసినట్లు సమాచారం.