ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

బుర్ఖాలో వచ్చారు.. యువతిని అపహరించారు - latest crime news in kadapa dst

ఇంట్లో ఉన్న యువతిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బుర్ఖా ధరించి అపహరించిన ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది. వైవీ స్ట్రీట్​కు చెందిన 21 ఏళ్ల యువతి ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బుర్ఖా ధరించి ఆమెను కిడ్నాప్​ చేశారు. గమనించిన స్థానికులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ సూర్యనారాయణ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించారు. యువతిని కిడ్నాప్ చేశారా..​ లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు.

two unknown persons kidnaped a women in kadapa dst
యువతిని అపహరించిన గుర్తుతెలియని వ్యక్తులు

By

Published : Feb 27, 2020, 7:45 PM IST

ఘటనా స్థలిలో విచారణ చేస్తోన్న పోలీసులు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details