చిన్నపాటి ఏమరపాటు కారణంగా ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. నల్లమాడకు చెందిన రాజశేఖర్, కృష్ణకుమార్ అనే ఇద్దరు యువకులు వేర్వేరు ద్విచక్రవాహనాలపై ఓబులదేవరచెరువుకు బయలుదేరారు. మార్గమధ్యలో కొండకమర్ల సమీపంలోని ఎస్.కొత్తపల్లి వద్ద వాహనాలు మలుపు తిప్పే క్రమంలో పక్కనే ఉన్న గుంతలో పడ్డారు. అక్కడికక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు విలపించిన తీరు అందర్నీ కలచి వేసింది. విషయం తెలుసుకున్న మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఘటనాస్థలికి వచ్చి... మృతుల బంధువులను ఓదార్చే ప్రయత్నం చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి - Two teenagers died in road accident at ananthapuram
అజాగ్రత్త కారణంగా జగిరిన రోడ్డు ప్రమాదంలో... ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి