ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

కన్నకూతుర్లనే కడతేర్చిన కేసులో ముమ్మర దర్యాప్తు

మూఢనమ్మకమే మదనపల్లెలో అక్కచెల్లెళ్ల హత్యకు కారణమని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. ఇప్పటి వరకు తల్లే ఇద్దరు కుమార్తెలను చంపినట్లు భావిస్తుండగా....హత్యోదంతంలో పెద్ద కుమార్తె ప్రమేయం కూడా ఉందని తెలుస్తోంది. దెయ్యం పట్టిందంటూ చెల్లిని చంపేసిన అక్క... ఆ తర్వాత తననూ చంపాలని కోరిందని.. తల్లిదండ్రులు చెప్పినట్లు తెలిసింది.

madanapalle chittoor district
two sisters were killed by their parents in madanapalle

By

Published : Jan 25, 2021, 9:37 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లె శివారు శివనగర్‌లో ఆదివారం రాత్రి జరిగిన జంటహత్యల కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. కన్నకుమార్తెలను కడతేర్చిన తల్లితండ్రులు పురుషోత్తం, పద్మజ నుంచి.. సమాచారం రాబడుతున్నారు. విపరీతమైన మానసిక సమస్యలతో బాధపడుతూ తమ కుమార్తెలు అలేఖ్య, సాయి దివ్యలను.. తల్లి దారుణంగా హతమార్చినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. తండ్రి పురుషోత్తం సైతం.. ఆ సమయంలో ఇంటిలోనే ఉండటంతో ఆయన పాత్రపైనా కూపీ లాగారు. ఈ క్రమంలో తల్లితండ్రులు కొన్ని విస్తుపోయే నిజాలను వెల్లడించినట్లు తెలుస్తోంది.

కన్నకూతుర్లనే కడతేర్చిన కేసులో ముమ్మర దర్యాప్తు

దెయ్యం ఆవహించింది... పూజలు చేయాలి

చిన్నకుమార్తె సాయిదివ్యకు దెయ్యం ఆవహించిందని, ఇందుకు విరుగుడుగా కొన్ని పూజలు చేయాలని పెద్దకుమార్తె అలేఖ్య తరచూ చెప్పేదని తల్లితండ్రులు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే సాయిదివ్యను, తన అక్క అలేఖ్యే హత్యచేసిందని తల్లి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. అనంతరం పూజ గదిలో తననూ కూడా కొట్టి చంపాలని అలేఖ్య కోరినట్లు సమాచారం. తానూ చనిపోయి చెల్లిని....... తిరిగి తీసుకొస్తానని......అప్పటివరకూ పూజలు చేయాలని అలేఖ్య కోరడం వల్లే ఈ దారుణం జరిగిందని పోలీసులకు.. పద్మజ వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే.... ఈ దంపతుల మానసిక స్థితి సరిగా లేకపోవటంతో పోలీసులు ఈవిషయంలో మరింత లోతుగా విచారించాలని నిర్ణయించారు.

కథ ముగిసింది..శివ ఈజ్ కమింగ్....

ఇదే సమయంలో చనిపోయిన యువతుల సామాజిక మాధ్యమాల్లోని పోస్టింగ్‌లూ అనేక సందేహాలు లేవనెత్తుతున్నాయి. శివుడు వస్తున్నాడని, ఇక కథ ముగిసిపోతుందంటూ...... అలేఖ్య ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టింగ్‌లపై పోలీసులు దృష్టిసారించారు. ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఇంటికి ఎవరైనా వచ్చారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు..హత్య జరిగిన చోట లభించిన ఆధారాలు, వింతైన ఆకృతుల ఫోటోలను స్వాధీనం చేసుకున్నారు. తల్లితండ్రులు, స్థానికుల వాంగ్మూలాలను రికార్డు చేసుకున్నారు. మానసిక సమస్యలు ఉండటంతో వైద్యుల అనుమతి తర్వాతే దంపతుల్ని అరెస్ట్‌ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. స్థానికులు, ఆ దంపతుల సహోద్యోగులు జరిగిన దారుణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

మరోవైపు హత్యాస్థలిలో క్లూస్‌ టీం ఆధారాలు సేకరించిన తర్వాత పోలీసులు అలేఖ్య, సాయిదివ్య మృతదేహాలను... మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పెద్దతోపు శ్మశానవాటికలో కొద్దిమంది బంధువుల మధ్య... తండ్రి పురుషోత్తం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చదవండి

పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే... మీ యుద్ధంలో మేం భాగస్వామ్యం కాబోము: సుప్రీంకోర్టు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details