ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ప్రేమ విఫలమైందని ఒకరు...కుటుంబ సమస్యలతో మరొకరు - అనంతపురం జిల్లా నేర వార్తలు

అనంతపురం జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులు అర్ధాంతరంగా లోకాన్ని వీడారు. ప్రేమ విఫలమైందని ఒకరు ప్రాణం తీసుకోగా... కుటుంబ సమస్యల కారణంగా మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు.

two-people-suicide-in-anantapuram-district
two-people-suicide-in-anantapuram-district

By

Published : Jul 5, 2020, 10:53 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ముదిగల్లు గ్రామంలో చిరంజీవి అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని గ్రామస్తులు తెలిపారు. చిరంజీవి గ్రామంలో అందరితో కలివిడిగా ఉండేవాడని స్థానికులు తెలిపారు. అయితే హఠాత్తుగా అతను కన్నుమూయటంతో స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కళ్యాణదుర్గం తరలించారు.

కుటుంబ సమస్యలతో...

ఉరవకొండ పట్టణంలోని 10వ వార్డులో నివాసం ఉంటున్న ఉమామహేశ్వర (28) అనే యువకుడు ఆదివారం సాయంత్రం ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పెనుగొండ వద్ద ఉన్న కియా సంస్థలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. చేతికి అందొచ్చిన కుమారుడు తమను విడిచి పోయాడంటూ అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు... దర్యాప్తులో తేలిందని ఎస్సై ధరణి బాబు తెలిపారు.

ఇవీ చదవండి:విహారయాత్రలో విషాదం... ఊబిలో ఇరుక్కుని యువకుడి మృతి

ABOUT THE AUTHOR

...view details